$$$__________@@@_________$$$
జూనియర్ డాక్టర్ పై హత్య చేసిన వారిని ఉరితీయాలి
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, ఆగష్టు20(విజయస్వప్నం.నెట్)
కోల్ కొత్త వైద్య కళాశాలలో జూనియర్ లేడీ డాక్టర్ పై హత్యాచారం చేసిన వారిని ఉరితీయాలని మండల కేంద్రంలో మంగళవారం ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు,ఉద్యోగులు నిరసన తెలిపి ర్యాలీ నిర్వహించారు. జూనియర్ మహిళ వైద్య విద్యార్థినిపై అత్యాచారం,అతి కిరాతకంగా హత్య చేసిన దోషులను నడి రోడ్డుపై ఉరితీయాలని డిమాండ్ చేస్తూ.... రెవెన్యూ కార్యాలయం నుండి అంబేద్కర్ కూడలి మీదుగా పోలీసుస్టేషన్ వరకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో పాటు శ్రీమస్తాన్,రైయిన్భో,వశిష్ట ప్రైవేట్ పాఠశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ.... నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి, అనంతరం పోలీసుస్టేషన్ వద్ద మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు.ఈకార్యక్రమంలో ఓడిసీ యువసైన్యం,హెల్ప్ హ్యాండ్స్ సేవకులు లడ్డు బాబ్జాన్,ఆసీఫ్,జాహీర్,ఆర్పీ, హర్షద్,కర్ల సుమంత్,వ్యాయామ ఉపాధ్యాయుడు గోపీకృష్ణ,వెటర్నరీ వైద్యాధికారి ప్రవీణ్ కుమార్,ఏపిఎం రమణప్ప,సిసీలు, ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు జయసింహ రెడ్డి,శివ శంకర్ రెడ్డి, మస్తాన్,ప్రిన్సిపాల్ రామకృష్ణ, ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు పాల్గొన్నారు.
$$$__________@@@_________$$$
అసైన్డ్ భూములు పరిశీలించిన ఆర్డీవో
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, ఆగష్టు20(విజయస్వప్నం.నెట్)
మండలంలోని తిప్పేపల్లి, వెంకటాపురం పంచాయతీ గ్రామాల్లో మంగళవారం పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖ అసైన్డ్ భూములు పరిశీలించారు. వెంకటాపురం పంచాయతీలో నారప్పగారిపల్లి,తిప్పేపల్లి పంచాయతీ గ్రామాల్లో ఆర్డీవో భాగ్యరేఖ సందర్శించి అసైన్డ్ భూములు అర్హులైన లబ్దిదారులకు చెందినవా....లేదా అని స్వయంగా రైతుల సమక్షంలో అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ జాకిర్ హుస్సేన్, విఆర్ఓలు రామాంజనేయులు,రమణ,కొండప్ప సర్వేయర్లు పాల్గొన్నారు.
$$$__________@@@_________$$$
గ్రామసభలు విజయవంతం చేయాలి
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం ఆగస్టు 23 శుక్రవారం మండల పరిధిలోని 14 పంచాయతీ గ్రామాలలో 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు గుర్తింపు కొరకు గ్రామసభలు సర్పంచుల అధ్యక్షతన నిర్వహించనున్నట్లు బుధవారం ఎంపీడీవో వరలక్ష్మి పేర్కొన్నారు. అందులో భాగంగా ఉపాధి హామీ సిబ్బందికి, గ్రామపంచాయతీ కార్యదర్శులకు సమావేశం ఏర్పాటు చేసి గ్రామసభల నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. ప్రజాప్రతినిధులు, కూలీలు,రేట్లు, శ్రమశక్తి సంఘాల సభ్యులు,గ్రామ సంఘాల ప్రతినిధులు,గ్రామప్రజలు పాల్గొని సభను విజయవంతంగా నిర్వహించడానికి సహకరిస్తారని ఈ సమావేశంలో ఎంపీడీవో పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ఏఓ సుధాకర్,టెక్నికల్ అసిస్టెంట్ ఆంజనేయులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
$$$__________@@@_________$$$
పని సర్ధుబాటు ప్రక్రియను నిలిపివేయాలి
-డీటీఎఫ్ నాయకులు గౌస్ లాజమ్
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, ఆగష్టు21(విజయస్వప్నం.నెట్)
ఉపాధ్యాయ మనోభావాలకు విరుద్ధంగా జరుగుతున్న పని సర్దుబాటు ప్రక్రియను వెంటనే ఆపాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డిటిఎఫ్)జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్ బుధవారం డిమాండ్ చేశారు.పని సర్దుబాటు కౌన్సిలింగ్ పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఎక్కడా పొరపాట్లు లేకుండా పారదర్శకంగా పని సర్దుబాటును చేస్తామని,అందుకోసమే ఒక సాఫ్ట్వేర్ ని డిజైన్ ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా పని సర్దుబాటు ప్రక్రియను చేపట్టామని ప్రభుత్వం ఒక వైపు చెబుతున్నా కూడా ఇది పూర్తిగా ఉపాధ్యాయ మనోభావాలకు వ్యతిరేకంగా వుందని ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.ఓవైపు సబ్జెక్ట్ టీచర్ల కొరత అంటూనే నేడు బుధవారం జరిగిన మండల స్థాయి పని సర్దుబాటులో ఎస్ జి టి టీచర్లను ఇష్టం లేకున్నా బలవంతంగా ఉన్నత పాఠశాలకు కేటాయిస్తున్నారని,ఉపాధ్యాయుల ఐచ్ఛికాన్ని పరిగణనలోకి తీసుకోకుండా క్వాలిఫికేషన్ ఉన్న కారణంగా ఉపాధ్యాయులు కచ్చితంగా ఆఫ్ట్ చేసుకోవాల్సిందేనని ఆదేశిస్తూ ఉన్నత పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు.మండలంలో ఎస్ ఏ,ఎస్ జి టి లకు ఒకేసారి పని సర్దుబాటు కౌన్సిలింగ్ జరగాల్సి ఉందని, కానీ మండల డివిజనల్ స్థాయిలో సబ్జెక్ట్ టీచర్ల పని సర్దుబాటు పూర్తి అయిన తర్వాతనే ఎస్జీటీల కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించడం సమంజసంగా లేదని తెలిపారు. ప్రక్రియ పూర్తిస్థాయిలో మండల పరిధిలోనే జరగాలని తెలిపారు. అలాగే పాఠశాలలో 21 మంది పిల్లలు ఉంటే ఇద్దరు ఎస్జీటీ ఉపాధ్యాయులు ఉండాలని,కానీ నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో చాలా పాఠశాలల్లో 21 మంది పిల్లలు ఉన్నా ఒక ఉపాధ్యాయుని సర్ ప్లేస్ గా చూపుతున్నారన్నారు.హై స్కూల్ ప్లస్ పాఠశాలలకు నిబంధనల ప్రకారం పని సర్దుబాటు నుండి మినహాయింపు ఉన్నా,నిబంధనలకు విరుద్ధంగా ఆ పాఠశాలల్లో పని సర్దుబాటుకు పూనుకోవడం హాస్యాస్పదమన్నారు.వెంటనే పని సర్దుబాటు ప్రక్రియను ఆపాలని,అందులోని తప్పిదాలను పూర్తిగా సరిదిద్దిన అనంతరం ఉపాధ్యాయ మనోభావాలకు అనుగుణంగా ప్రక్రియ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి