పాడిఆవు ప్రాణం కాపాడిన పశు వైద్యాధికారి
పశు వైద్యాధికారుల సేవలకు అభినందనల వెల్లువ
శ్రీ సత్యసాయిజిల్లా అమడగూరు ఆగష్టు02(విజయస్వప్నం.నెట్)
మూగజీవాల ప్రేమికులు నిత్యం వాటి సంరక్షణ కోసం తాపత్రయ పడుతుంటారు.అలాంటి ఆలోచనలో వున్నవారు పశు సంవర్థ శాఖలో సేవలు అందించాలని పశు వైద్య విద్య రంగాల్లో రాణించి మూగజీవాల సంరక్షణ కోసం ఎంచుకున్న పశు సంవర్థ శాఖలో కొలువులో చేరి ఆలోచనను ఆచరణలో పెట్టి సేవలు అందిస్తూ సంతృప్తి చెందుతుంటారు.అలాంటి కోవకు చెందిన వైద్యాధికారులు నిన్నటి రోజు(శుక్రవారం)పాడిఆవుకు శస్త్ర చికిత్సలు అందించి ప్రాణ వాయువు పోసిన పశు సంవర్థ శాఖ వైద్యుల సేవలకు ప్రజల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పాడిఆవు మేసే మేతలో ఏలాంటి ప్లాస్టిక్,వ్యర్థ పదార్థాలు గ్రాశంలో మేసిందో....దాదాపు రెండు వారాలుగా నోరులేని మూగజీవం ప్రాణాపాయ స్థితిలో తల్లడిల్లుతున్న సమాచారం తెలుసుకున్న పశు సంవర్థ శాఖ వైద్యాధికారులు స్పందించి శస్త్రచికిత్సలు చేసి యథా స్థితికి తీసుకొచ్చి ప్రాణ వాయువు అందించారు.వివరాల్లోకి వెళితే..... శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు మండల పరిధిలోని గుండువారిపల్లి గ్రామంలో శుక్రవారం మజ్జిగ కృష్ణారెడ్డికి చెందిన పాడిఆవు గత 15 రోజులుగా అనారోగ్యంతో మేత మేయలేని పరిస్థితిని గమనించి మండల ఇంచార్జ్ పశువైద్య అధికారి హరినాథ్ రెడ్డికి సమాచారం ఇవ్వగా ఇంఛార్జి వైద్యులు సూచనలతో డాక్టర్ రామేశ్వర్,డాక్టర్ శ్రీనివాసులు స్పందించి హుటాహుటిన పాడిఆవుకు శస్త్రచికిత్స చేసి పాడిఆవు ప్రాణాన్ని కాపాడారని పాడి రైతు పేర్కొంటూ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.గతం లో కూడా డాక్టర్ రామేశ్వర్ ప్రజలకు నిరంతరం అందుబాటులో వుండి ఎటువంటి సమస్యలు వచ్చిన వెంటనే స్పందించి మెరుగైన వైద్య సేవలు అందించేవారాని గ్రామస్తులు కొనియాడుతూ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కి సహాయకులు గా ఏహెచ్ఏలు గోవర్ధన్ రెడ్డి,రాజశేఖర్,కార్తీక్,శ్వేతవాహణ్ పాల్గొన్నారు. మూగజీవాలను సంరక్షణ కోసం పశు సంవర్థ శాఖలో కొలువు సాధించి సేవలు అందించాలని అభిరుచి మేరకు పశు సంరక్షణ వైద్య విద్య అభ్యసించినట్లు పశుసంవర్ధక శాఖ వైద్యాధికారులు పేర్కొన్నారు. మూగజీవాల సంరక్షణ కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న పశు సంవర్థ శాఖ వైద్యాధికారులకు గ్రామీణులు ప్రణామములు పలుకుతూ.... అభినందనలు తెలిపడం విశేషం. గ్రామీణ ప్రాంతంలో పాడిఆవుకు ప్రత్యక్షంగా శస్త్రచికిత్సలు చేసిన వీడియోలు వైరల్ అవడంతో వైద్యాధికారుల సేవలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
$$$__________@@@__________$$$
రేపు జిల్లా కేంద్రంలో ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయండి : సిఐటీయు పిలుపు
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు,ఆగష్టు03(విజయస్వప్నం.నెట్)
జిల్లావ్యాప్తంగా అంగన్వాడి,ఆశ,మధ్యాహ్నం భోజన ఏజెన్సీ,ఫీల్డ్ అసిస్టెంట్లు,కాంటాక్ట్ అవుట్సోర్సింగ్,మున్సిపల్ కార్మికులు,యానిమేటర్లు, కార్మికులపై రాజకీయ వేధింపులు అక్రమ తొలగింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ....రేపు(సోమవారం)సత్యసాయిజిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టే ధర్నా కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని శనివారం సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు.ఈసందర్భగా ఓడిచెరువు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ....తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా కాకముందే జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ సంస్థల్లో(పథకాలలో) పనిచేస్తున్న చిరుద్యోగులను రాజకీయంగా వేధిస్తూ అక్రమంగా తొలగిస్తున్నారని పేర్కొంటూ.... తెదేపా నాయకుడు వేధింపులు భరించలేక ఓడిసి మండలంలోని వీరప్పగారిపల్లి అంగన్వాడీ కార్యకర్త నాగమణి పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్ననికి పాల్పడిందన్నారు.చిరుద్యోగుల పైన వేధింపులు ఆపకపోతే ఆందోళన తీవ్రతం చేస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మంగమ్మ.ఆశీర్వాదమ్మ,సిఐటియు నాయకులు శ్రీరాములు, కుళ్లాయప్ప, శ్రీనివాసులు, శ్రీకాంత్, నాగరాజు, లక్ష్మీపతి పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
నూతన చౌక ధాన్యపు డిపో ప్రారంభం
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు,ఆగష్టు03(విజయస్వప్నం.నెట్)
మండలంలోని అల్లాపల్లి పంచాయితీ ఉగ్గిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి,పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి సూచనల మేరకు నూతన ఛౌక ధాన్యపు దుకాణం ప్రారంభించారు. తెదేపా సీనియర్ నాయకులు, డీలర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన చౌక ధాన్యపు డిపో ప్రారంభించారు.ఈకార్యక్రమలో తెదేపా సీనియర్ నాయకులు బోయపల్లి శివారెడ్డి,గ్రామకమిటీ అధ్యక్షుడు కృష్ణమూర్తి,హనుమంతరెడ్డి,రాజేంద్రరెడ్డి,బావయ్య,రిటైర్డ్ టీచర్ జీవి.ఆదినారాయణ,రాజగోపాల్,డీలర్ శివ నారాయణ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
తిరుమల స్వామివారి సన్నిధిలో ఎమ్మెల్యే పల్లె సింధూర
శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి ఆగష్టు03(విజయస్వప్నం.నెట్)
తిరుమల కొండపై శనివారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవ శ్రీ వెంకటేశ్వరస్వామివారిని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి,పివీకెకే ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్ పల్లె కృష్ణ కిషోర్ రెడ్డితోపాటు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని శ్రీ వేంకటేశ్వరస్వామి కృపతో.. ప్రజలంతా సుఖ సంతోషాలతో,ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని వారు ఆ భగవంతున్ని కోరుతూ ప్రార్థించారని తెలిపారు.
$$$__________@@@__________$$$
సమాచార హక్కు చట్టం పుస్తకాలు అందజేత
శ్రీసత్యసాయిజిల్లా(పుట్టపర్తి)ఆగష్టు03(విజయస్వప్నం.నెట్)
శ్రీసత్యసాయిజిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం జిల్లా రెవెన్యూ అధికారులకు,పరిపాలనా అధికారులకు సమాచార హక్కు చట్టం పుస్తకాలు సమాచార హక్కు ప్రజా చైతన్య వేదిక సంస్థ జిల్లా ఇంచార్జి హబీబుర్ రెహమాన్,పోతలయ్య,లింగమయ్యలతో కలిసి అందజేసారని తెలిపారు.
$$$__________@@@__________$$$
చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు ఆపాలి: సీఐటీయు
శ్రీ సత్యసాయిజిల్లా(పుట్టపర్తి) ఆగష్టు03(విజయస్వప్నం.నెట్)
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణ కేంద్రంలో శనివారం గణేష్ కూడలిలో సీఐటీయూ మండల కన్వీనర్లు పైపల్లి గంగాధర్,పెడపల్లి బాబా విలేకరుల సమావేశం ఏర్పాటు మాట్లాడుతూ.... తెదేపా కూటమి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి కనీసం రెండు నెలలు కూడా గడవకముందే చిరుద్యోగులపై అలాగే స్కీం వర్కర్లపైన,అంగన్వాడి,ఆశ,మధ్యాహ్నం భోజన ఏజెన్సీ, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులపైన రాజకీయ వేధింపులు చేయడం, తొలగింపులు దారుణమన్నారు.రాజకీయ నాయకుల అనుచరులకు ఉద్యోగాలలో చేర్పించడం కొరకు అధికారులపైన ఒత్తిళ్లు తెస్తున్నారని ఈలాంటి పద్ధతి సబబు కాదని,కొత్త ప్రభుత్వం ఏర్పడింది ప్రజలకు మేలు చేస్తారని ఓట్లు వేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చి కనీసం రెండు నెలలు కూడా పూర్తి అవ్వకముందే ప్రజలపైన,అలాగే కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ చిన్న ఉద్యోగస్తులపైన రాజకీయ వేధింపులు మొదలైయాయని,ఈ వేధింపులు ఇంతటితో ఆపకపోతే సిఐటియు ఆధ్వర్యంలో ప్రజా సంఘాలతో కలిసి రాబోయే కాలంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.అలాగే ఈనెల 5న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు ఈసందర్భంగా పిలుపునిచ్చారు.
$$$__________@@@__________$$$
ముప్పై ఏళ్ల మాదిగల చిరకాల స్వప్నం ఎస్సీ వర్గీకరణ
డప్పు వాయిద్యాల మధ్య విజయోత్సవ ర్యాలీ
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు ఆగష్టు04(విజయస్వప్నం.నెట్)
30 ఏళ్ళు ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అలుపెరుగని పోరాటం చేశారని, ఆ పోరాట ఫలితంగానే ఇటీవల సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ సమంజసమైందని ధర్మాసనం తీర్పు వెల్లడించడంతో ఆదివారం ఓడిచెరువు మండల కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ స్థానిక ఎమ్మార్పీఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు లక్ష్మన్న,నాగల భావన్న,మహాజన జర్నలిస్ట్ ఫోరం జిల్లా అధ్యక్షులు ఎల్లంరాజు,సీనియర్ నాయకులు ఎర్ర దొడ్డప్ప,జిల్లా నాయకులు డి.రమణ,మాజీ మండల అధ్యక్షులు ముద్దలపల్లి శ్రీనివాసులు,పలక గంగన్న,కత్తి ఆనంద్ లు మాట్లాడుతూ మాదిగలు చిరకాల స్వప్నం ఎస్సీ వర్గీకరణ అని మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగానే షెడ్యూల్ కులాల వర్గీకరణ సాధ్యమైందని మాదిగలు విద్యా,ఉద్యోగ రంగాలలో అగ్రభాగాన నిలవడానికి ఎస్సీ వర్గీకరణ ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలిపారు.అంతకుమునుపు వైఎస్ఆర్ సర్కిల్ నుండి బిఎస్ఎన్ఎల్ టవర్ వరకు డప్పు వాయిద్యాల మధ్య కోలాహలంతో టపాసులు పేలుస్తూ ప్రధాన వీధుల్లో నినాదాలు చేస్తూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.ఈకార్యక్రమంలో మండలంలోని మాదిగలు అధిక సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మిఠాయిలు పంచి పెట్టారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బొచ్చు కదిరప్ప,ఎంఈఎఫ్ జిల్లా కార్యదర్శి వై.నరసింహులు, మాజీ మండల ఉపాధ్యక్షులు చౌడంపల్లి రామాంజనేయులు, ఎంవిఎఫ్ నాయకులు వై,రామాంజి,సర్వేయర్ గంగప్ప,తుమ్మలకుంట్లపల్లి నరసింహులు,మాజీ సర్పంచ్ రమణ,నర్సింహులు,నరేష,పక్కిరప్ప,మారప్ప,ధారా రమణ సీనియర్ నాయకులు తోల నాగభూషణ,తంగేడుకుంట రమణ,ఎమ్మెస్ఎఫ్ లక్ష్మీపతి, డప్పు నరేష్,కురమాల గంగాద్రి, రవి, అక్కులప్ప, యూ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
అంగరంగ వైభవంగా శ్రీచౌడేశ్వరీ అమ్మవారి జయంతి వేడుకలు
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడగూరుఆగష్టు04(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలో వెలసిన శ్రీచౌడేశ్వరిదేవి అమ్మవారి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.వివధ రకాల పుష్పాలతో అమ్మవారిని అలంకరణ చేసి పురోహితులు మంత్రోచ్ఛారణలతో అభిషేకాలు,అర్చనలు,దూప,ద్వీప నైవేద్యం సమర్పించారు.ఆలయ ధర్మకర్త పొట్టా పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ కోరికలు తీర్చే గ్రామ దేవత చౌడేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులకు ప్రతేక ధన్యవాదాలు తెలిపారు.అమ్మవారి జయంతి వేడుకలు వైభవంగా జరుపుతున్నామని అమ్మ వారి ఆశీస్సులు అందరికీ అందాలని కోరారు, దర్శనం కోసం విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం తరఫున మెగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అమ్మవారి గుడికి సప్లయర్ సామాగ్రి విరాళం అందించిన నారాయణస్వామి దంపతులు కుమారుడు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పట్టా పురుషోత్తం రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు,రాజారెడ్డి,మాజీ ఎంపీటీసీ రాజారెడ్డి సప్లయర్స్ రమేష్ 16 గ్రామాల గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఓడిచెరువులో ఘనంగా చౌడేశ్వరి జయంతి వేడుకలు
శ్రీ సత్యసాయి జిల్లా ఓడిచెరువు మండలం అల్లాపల్లి పంచాయతీ చౌడంపల్లి గ్రామంలో వెలసిన గ్రామ దేవత శ్రీచౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆదివారం అమ్మవారి జయంతి సందర్భంగా వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలతో ఘనంగా అమ్మవారి జయంతి ఉత్సవాలు నిర్వహించారు. శ్రీచౌడేశ్వరిదేవి అమ్మవారికి ఉదయం అభిషేకాలు, అర్చనలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు పూజారి శివరామ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అమ్మవారి ఆలయ దర్శనానికి వచ్చిన భక్తాదులకు తీర్థప్రసాదాలు అందజేసి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి